బజార్ ( జనం సాక్షి ) : మండల కేంద్రంలో సుమారు 3.కోట్ల ఫై ఐటీడిఏ నిదులు వెచ్చించి నిర్మించిన భవనాన్ని ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారీ వరుణ్ రెడ్డి వచ్చి పరిశీలన చేశారు ఈ భవనంలో బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయుటకు పరిశీలన చేశారు నియోజకవర్గం పరిధిలో బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కళాశాల కొనసాగటానికి అనుకూలంగా ఉందని 150 మంది విద్యార్థుల కు సరిపోతుంది కంప్యూటర్ గదులకోసం రూపాయలు 5.లక్షలు వెచ్చించి నిర్మించిన పక్షంలో సరిపోతుంది అని పి ఓ తన వెంట వచ్చిన గురుకుల ప్రిన్సిపాల్ తో అన్నారు150 మందికి తరగతులు కొనసాగుటకు 6 గదులు మిగతావి వసతి గృహం కొరకు వినియోగించుకొంటే సరిపోతుందని పేర్కొన్నారు పి.ఓ వరుణ్ రెడ్డి వెంట ఏ టీ డబ్ల్యూ సౌజన్య గురుకుల ప్రిన్సిపాల్ ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోధ్యాయులు మడావి కృష్ణారావు పలువురు సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు
గురుకుల డిగ్రీ కళాశాల భవనం పరిశీలించిన పి.ఓ వరుణ్ రెడ్డి




