గుర్తురు గౌడ నూతన సోసైటీ ఎన్నిక
తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి )
మండలంలో ని గుర్తురు గ్రామ గీతా పారిశ్రమిక సహకార సొసైటీ నూతన కమిటీనీ శనివారం ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. సోసైటీ నూతన అధ్యక్షులు గా పంజాల శంకర్, ఉపాధ్యక్షులుగా ముత్యం రవితో పాటు మరో 8 మందిని డైరెక్టర్లు ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ నిరంతరం అందుబాటులో ఉంటూ, గౌడ కులస్తుల సంక్షేమనికి, అభివృద్ధికి పాటు పడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ ప్రజాప్రతినిధులు, గౌడ సర్పంచ్, సార్కోళ్ల గౌడు, మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు, మాజీ గౌడ సర్పంచ్ లు, మాజీ డైరక్టర్స్, గౌడ ముఖ్య, సీనియర్, యూత్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
—