గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ బహూకరణ
ఖానాపురం సెప్టెంబర్ 17జనం సాక్షి
మండలంలోని కొత్తూరు గ్రామంలో గణపతి సెంటర్ వద్ద ఉన్న గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామానికి అవసరమైన ఫిజర్ బాక్స్ ( శవపేటికను ) శనివారం గ్రామ సర్పంచ్ భూస రమ అశోక్ , ఉప సర్పంచ్ వీర పాక స్వామి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, వార్డు మెంబర్లు మాజీ సర్పంచులు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు. అలాగే గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు చేస్తున్న సేవలను గుర్తించి గ్రామ సర్పంచి రమఅశోక్, ఒకటో వార్డు నెంబర్ అజ్మీర్ రాజు నాయక్, కలిసి కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అలాగే గ్రామంలోని అంగన్ వాడి టీచర్లను ఆశా వర్కర్ లను పూల బొకేలు తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రాము, మమత, బిక్షపతి, గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షుడు పోతరాజు కుమారస్వామి, ఉధ్యక్షుడు సొంటి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి అశోక్, క్యాషియర్ సురేష్, రాం ప్రసాద్,కుమార్ స్వామి, డాక్టర్ వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు రాములు,ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ , యాకయ్య, జిపి సిబ్బంది జంపయ్య,
కట్టయ్య, చంద్రయ్య, కోటి, వెంకటేశ్వర్లు,ఎండి యాకుబ్, సాంబయ్య, శేఖర్, రవి, చంద్రమౌళి, లింగయ్య, వీరన్న, చేరాలు తదితరులు పాల్గొన్నారు.