గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : కిసాన్​ మోర్చ రాష్ర్ట అధ్యక్షులు భూనేటి మారుతి కిరణ్​

 పరిగి రూరల్​, అక్టోబర్​ 1( జనం సాక్షి) :
ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేస్తే పరిగిలో బీజేపీ ఎమ్మెల్యే గా గెలుపొందడం చాలా సులభమని తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు భూనేటీ మారుతి కిరణ్ అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగి కుల్కచర్ల మండల గణాపురం వెంకటయ్య నివాసంలో ముఖ్య కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. పరిగి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చాలా పటిష్టంగా ఉందని, కేవలం వారిని కలిసి ప్రొత్సహించే వారు లేకపోవడం వల్లే వెనకంజలో ఉన్నామన్నారు. బీజేపీ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. నరేంద్రమోడీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను గురించి తెలియజేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి వారిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు ,యాదయ్య, మోత్కూర్ సర్పంచ్  కేశవులు, బాలకృష్ణ రెడ్డి,  రామ్ యాదవ్, కులక్చర్ల బిజెపి మండల అధ్యక్షులు మైపాల్​, బీజేవైఎం నాయకులు మైపాల్ , జాజుల అనిల్, రాజు, పరమాందాస్, శివ,ఆంజనేయులు,  బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫోటో రైటప్​ :
01 పిఆర్​ జి 01లో బీజేపీ పార్టీ నాయకులతో మాట్లాడుతున్న  కిసాన్​ మోర్చ రాష్ర్ట అధ్యక్షులు భూనేటి మారుతి కిరణ్