ఎమ్మెల్యే మణిక్ రావు సన్మానించిన గిరిజన సంఘం నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి కొరకు 6% శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10 % శాతముకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జహీరాబాద్ గిరిజన నాయకులు మాజీ కాన్సిలర్ మోతీరం రాథోడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బి.అర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.అనంతరం స్థానిక శాసన సభ్యులు .కె.మణిక్‌రావు ను సన్మానించి మిఠాయి తింపిచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సయ్యద్ మొహిద్దిన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు శెట్టి రాథోడ్, ఎస్టీ సెల్‌ అధ్యక్షులు హీరు రాథోడ్, జహీరాబాద్ తెరాస పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు విజయ్‌రాథోడ్, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షులు మోహన్‌చవాన్, సర్పంచులు ఉమేష్‌లాల్ రాంశెట్టి, గోపాల్, మాజీ సర్పంచ్ శంకర్,
నాయకులు ప్రేమ్‌సింగ్, భీంసింగ్, వాసు పవర్, శ్రీను పవర్, గులాబ్‌సింగ్, మధు, తులసిరామ్, గోవర్ధన్, రఘునాథ్, బంష నాయక్, పండురామ్‌ రాథోడ్, తులసిరామ్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.