గొర్రెలకు ఉచిత నీలి నాలుక టీకాలు

చౌడాపూర్, జులై 18(జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు వ్యాధులు రాకుండా ఉచిత నీలి నాలుక టీకాల కార్యక్రమం వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్త రంగారెడ్డి, స్థానిక ఎంపిటిసి శంకర్, ఉప సర్పంచ్ శివకుమార్, వార్డు మెంబర్లు అశోక్, గౌస్, రాజు మరియు టిఆర్ఎస్ యువ నాయకులు సత్తయ్య, మాజీ డిప్యూటీ సర్పంచ్ నాగయ్య, రామయ్య,రమేష్,మహేష్ మరియు గొర్రెల కాపర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.