గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై19(జనంసాక్షి) మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో గొర్రెలకు నీలి నాలుక( మూతి వాపు)వ్యాధి నిరోధక టీకాలు మంగళవారం వేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నుండి గొర్రెలను తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీలి నాలుక వ్యాధి టీకాలు గొర్రెలకు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టరు వినయ్ కుమార్,వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ పి అంజి ,గొర్రెల సహకార సంఘము అధ్యక్షుడు స్వాములు,గొర్రెల కాపరులు, సిబ్బంది రాఘవేంద్ర, వెంకటేష్,మధు తదితరులు పాల్గొన్నారు.