గోడ కూలి చిన్నారి మృతి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో  నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం నిర్మాణం చేపడుతున్న  ఓ గోడ అకస్మాత్తుగా కూలింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ చిన్నారి మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను 108లో ఆసుపత్రికి తరలించారు.