గోడ పత్రిక ను విడుదల చేసిన నాయకులు
జహీరాబాద్ సెప్టెంబర్ 11( జనం సాక్షి ) స్థానికత కోసం ముఖ్యమంత్రి కి వినతి కార్యక్రమంలో భాగంగా, చలో అసెంబ్లీ ని విజయవంతం చేయాలి అని ఉద్యమ నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం వారు గోడ పత్రిక ను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 317 జి ఓ కారణంగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇవ్వటానికి చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ నెల 12 న జరిగే పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కె.విఠల్, సియాసత్ అలీ, బక్కప్రభు, మన్నెల్లి శ్రీనివాస్, అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.