ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం పెరగింది. వాజేడు మండలం ఏజర్లపల్లికి చెందిన 30 మంది మత్స్యకారులు నిన్న చేపల వేటకు వెళ్లి గోదావరిలో చిక్కుకున్నారు. వీరిలో పదిహేను మందిని పోలీసులు రక్షించగలిగారు. మరో పదిహేను మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




