Wednesday, 4 November 2026

గౌతమి లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు..

 

మాకవరపాలెం ఫిబ్రవరి.17.( జనంసాక్షి ):
మండలంలో గల గౌతమి లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల22 నుండి విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు. ఆ సమితి వ్యవస్థాపకుడు పి. రంగరాజు అన్నారు. ప్రతి ఏటా తమ కళా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి. ఉగాది రోజున విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ పోటీలు వ్యాసరచన. క్విజ్. నృత్యం. డిబేట్.డాన్స్. తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని విద్యార్థులు. ఉపాధ్యాయులు సహకరించి విజయవంతం చేయాలని. ఆయన కోరారు…