మాకవరపాలెం. ఫిబ్రవరి.17.( జనంసాక్షి ):
మండలంలోని కొండల అగ్రహారంలో గల నల్లమారమ్మ అమ్మవారి పండగ మహోత్సావాన్ని భక్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయాన్ని నియోజక వర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్. మరియువైసీపీ నాయకులు చిటికెల రమణ. సర్పంచ్ పోలిరెడ్డి రమణ. నాయుడు తదితరులు పాల్గొని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ఉన్న భక్తులు కూడా నల్లమారమ్మ అమ్మవారిని దర్శించికునికోరిన కోర్కెలు తీర్చాలని పసుపు కుంకుమ లు ఇచ్చి మొక్కుకున్నారు. మధ్యాహ్నం కమిటీ సభ్యులు గ్రామస్తలకు అన్నసమారాధన కార్యక్రమం యార్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు..




