గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం
. సర్పంచ్ చల్ల ఉమా సుధీర్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 18,( జనంసాక్షి ) :
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ చల్ల ఉమ సుధీర్ రెడ్డి అన్నారు. మండలంలోని తాటికొండ గ్రామ పంచాయతీ పరిదిలోని 8 వ వార్డులో గ్రామ అభివృద్ధిలో భాగంగా తెలంగాణా తొలి ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొం డ రాజయ్య సహకారంతో సిడిపి నిధుల నుండి మంజూరి అయిన 5 లక్షలు రుపాయల తోటి సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ చల్లా ఉమ సుధీర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగింది.ఈకార్యక్రమంలో వైస్ ఎంపిపి చల్లాసుధీ ర్ రెడ్డి,ఉప సర్పంచ్ మారపాక రాములు, వార్డ్ సభ్యుడు చల్లా నరసింహారెడ్డి, గ్రామ పెద్దలు చల్లా రంగారెడ్డి, గ్రామ యూత్ నాయకులు చల్ల రాజేశ్, మారపాక సంపత్, యూత్ నాయకులు తదితరు లు పాల్గొన్నారు.