గ్రామాలకు బిటి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
-కొండమల్లేపల్లి నుంచి గౌరికుంట తండా వరకు నాలుగు లైన్ల రోడ్డు
– సొంత నిధుల నుంచి లైట్లు ఏర్పాటు
-కొండమల్లేపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా
-కొండమల్లేపల్లి పట్టణంలో గ్రంథాలయ భవనం నిర్మాణానికి కృషి
-గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి
-ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్లను బిటి రోడ్లు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి
– దేవరకొండ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి (జనం సాక్షి సెప్టెంబర్ 25
గ్రామాలకు బిటి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం కొండమల్లేపల్లి పట్టణంలో కొండమల్లేపల్లి నుంచి పాల్వాయి వరకు రూ.3.55కోట్లతో చేపడుతున్న బిటి రోడ్డు పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కొండమల్లేపల్లి నుంచి గౌరికుంట తండా వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి లైట్లను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ హామీ ఇచ్చారు. కొండమల్లేపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా అని ఆయన తెలిపారు.కొండమల్లేపల్లి పట్టణంలో గ్రంథాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్లను బిటి రోడ్లు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య,ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి పసునూరి సరస్వతమ్మ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్,రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి, సిరందాసు కృష్ణయ్య,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,వెంకట్ రెడ్డి,గుండెబోయిన లింగం యాదవ్ ,రమావత్ బీమ్ సింగ్,ఎంపీటీసీ వాస్కుల తిరుపతమ్మకాశయ్య,గంధం సురేష్,ఎలిమినేటి సాయి,రమావత్ రాములు,నేనావత్ శంకర్ నాయక్,రమావత్ శ్రీను నాయక్,రమేష్,దిప్ల,బోడ్డుపల్లి కృష్ణ,రూప్ల నాయక్,బాలు నాయక్,భద్రు నాయక్,ఎంపీడీఓ బాలరాజు రెడ్డి,తదితరులు పాల్గొన్నారు