Wednesday, 4 November 2026

గ్రామాల్లో దుర్గం చిన్నయ్య ప్రచారం

మంచిర్యాల,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ప్రచారం జోరుగా సాగుతోంది. బెల్లంపల్లి మండలంలోని ఇందిరానగర్‌, కాసిరెడ్డి పల్లి, భూదాకుర్దు, చాకేపెళ్లి, చంద్రవెళ్లి గ్రామాల ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తీర్మానించి, ప్రతిజ్ఞ చేశారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. టీఆర్‌ఎస్‌ కే ఓటేస్తామంటూ.. ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అలాగే స్వచ్ఛందంగా ప్రచారానికి తమవంతుగా సహాయాన్ని అందజేశారు.