వికారాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): పరిగి నియోజకర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్ రెడ్డి ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. గండీడ్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని మహేశ్ రెడ్డి సూచించారు. వెనుకబడిన పరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మహేశ్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. పలు కాలనీలలో ఆయన పాదయాత్ర చేసి, ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు. నియోజకవర్గం ప్రజలంతా టీఆర్‌ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరామని, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు.




