హైదరాబాద్,నవంబర్18(జనంసాక్షి): పంచాయితీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేదిశగా మార్పులు చేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా గ్రామాలను పరిపుస్టం చేయాల్సి ఉంది. గ్రామాల పరిధిలో అన్నీ సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగేలా చట్టసవరణ జరగాలి. గ్రామాల్లో జరిగే ప్రతి పని పంచాయితీల ఆధ్వర్యంలో జరిగేలా, దాని పరిధిలోనే అధికారులు పనిచేసేలా చూడాలి. అప్పుడే గ్రామాలు బలపడుతాయి. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయి. ప్రధానంగా పారిశుద్యం అన్నది పంచాయితీల సామాజిక బాధ్యతగా చేయాలి. ఇకపోతే కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హావిూలో పారిశుద్ధ్య పనులు చేర్చడంతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక భారం తప్పుతుంది. పారిశుద్ధ్య పనుల్లో ఉపాధి కూలీల ఏర్పాటుతో పంచాయతీలకు ఆర్థికభారం తగ్గుతుంది. పంచాయతీలకు వచ్చే నిధులు, ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఉపాధిహావిూ పథకాన్ని సద్వినియోగం చేసుకుకోవాలన్న సర్కార్ నిర్ణయంతో గ్రామాల్లో పారిశుద్యం వెల్లివిరియనుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేస్తున్న పనుల్లో గ్రావిూణ పారిశుధ్యాన్ని జోడించడం ద్వారా గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఓ రకంగా ఇదో మంచినిర్ణయంగా దేశానికి ఆదర్శం కానుంది. ఇలా దేశవ్యాప్తంగా ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి హావిూ పనుల్ని విస్తృతం చేయాలని, అందులో భాగంగా పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులను ఉపాధి కూలీలతో నిర్వహించాలని ఆ పథకం రాష్ట్ర మండలి నిర్ణయించింది. ఫలితంగా ప్రస్తుతం గ్రామాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల్లో మార్పు రానుంది. వాస్తవానికి పంచాయతీలకు లభించే సాధారణ నిధుల నుంచి 30 శాతం వరకు పారిశుద్ద్యానికి ఖర్చు చేయాలనే నిబంధన గతంలో ఉండేది. తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. అంటే పంచాయతీకి వస్తున్న
ఆదాయంలో సగం పారిశుద్ద్యానికే వెచ్చిస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడంలేదు. అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో పంచాయతీలు బలోపేతం కావడంతోపాటు వాటికి ఆర్థిక భారం కూడా తప్పుతుంది. కొత్తగా ఉపాధి కూలీలను పారిశుద్ధ్య పనుల్లోకి తీసుకుంటే గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త నిల్వలను తరలించే వీలుంటుంది. ఈక్రమంలో అధికారులు పారిశుద్ధ్య పనుల్లో ఉపాధి కూలీలను వినియోగించు కోవాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. ఈ నిర్ణయంతో అటు కూలీలకు పని దొరకడంతో పాటు ప్లలెలు పరిశుభ్రంగా మారే అవకాశం ఉంది. గ్రామాల పరిధిలో కూలీలకు ఏం పని చూపించాలని భావిస్తున్న ఉపాధి సిబ్బందికి అధికారుల నిర్ణయం ఊరటనిస్తోంది. కూలీలకు ప్లలెల్లోనే పారిశుద్ధ్య పనులు చూపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత, భూములు చదును చేయడం, నీటి తొట్లు, పొలాల్లో కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనుల ద్వారా ఉపాధి కూలీలకు వంద రోజుల పనులు కల్పించ వచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి హావిూ పథకంలో పారిశుద్ధ్య పనులు చేయించాలనే ఆలోచన మంచి నిర్ణయమని సర్పంచులు సైతం అంగీకరిస్తున్నారు. దీనివల్ల ప్లలెలు పరిశుభ్రంగా మారతాయి. పంచాయతీలకు ఆర్థిక భారం తప్పుతుంది. ఉపాధి కూలీలతో పారిశుద్ధ్య పనులు చేయిస్తే ఇటు కూలీలకు పనులు దొరకడంతో పాటు గ్రామాలు పరిశుభ్రంగా మారి ప్లలెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గ్రామ పంచాయతీల్లో ఇదివరకే డంపింగ్ యార్డుల నిర్మాణ పనులను ఉపాధి కూలీలతో చేపడుతున్నారు. పంచాయతీ పారిశుద్ధ్య పనులనూ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడంతో కూలీలకు వంద రోజులు సమృద్ధిగా పనులు కల్పించవచ్చని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు. ఇంతకాలం వంద రోజుల పనులు చేపట్టని కూలీలకు ఏవిధంగా పని చూపించాలనే ఆలోచిస్తున్న ఉపాధి సిబ్బందికి అధికారుల నిర్ణయం వూరటనిస్తోంది. కూలీలకు ప్లలెల్లోనే పారిశుద్ధ్య పనులు చూపించవచ్చు. అలాగే చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత, భూములు చదును చేయడం, నీటి తొట్లు, పొలాల్లో కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనులతో ఉపాధి కూలీలకు వంద రోజుల పనులు కల్పించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులను ఉపాధి హావిూ కూలీలతో చేయించే నిర్ణయాన్ని అధికారులు కూడా స్వాగతిస్తున్నారు. దీంతో పంచాయతీల్లో నెలకొన్న ప్రధాన సమస్య తీరుతుంది.




