గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, ఏఐటీయూసీ
నల్గొండ బ్యూరో. జనం సాక్షి.
పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే గ్రామీణ కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జినీ రత్నాకర్ రావు కోరారు.మంగళవారం నాంపల్లి లోని ఎంపిడిఓ కార్యాలయంలో ఇలొవే _ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల మండల స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి ఉత్పత్తి ఉందని అన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 25 శాతం ఉత్పత్తి అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్తి ఉత్పత్తిలో దాదాపు 6 కోట్ల మంది రైతులు 10 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రత్తి పంట ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ప్రతి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన సన్న మధ్య రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత, కార్మిక చట్టాలు అమలు కోసం ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) కృషి చేస్తుందని అన్నారు. కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ,శ్రమకు తగ్గ వేతనాలు పెంచాలనీ కోరే హక్కు ఉంటుందని అన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కోసం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం కోసం ,స్త్రీ పురుష వేతనాల వ్యత్యాస నివారణ కోసం, పని ప్రదేశాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు, రక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. పిల్లలను బడికి పంపాలని పనిలో పెట్టుకోవడం చట్టరిత్యా నేరమని పేర్కొన్నారు.అసంగటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. గ్రామీణ కార్మికులకు భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సు కు ఏఐటీయూసీ ,ఇలొవే మండల కో ఆర్డినేటర్ గిరి రమ అధ్యక్షత వహించగా, సిపిఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి చలం పాండురంగా రావు, ఎంపిడివో ఆఫీస్ సూపరింటెండెంట్ ఎండీ జాకీర్, సిపిఐ మండల సహయ కార్యదర్శి ఊరిపక్క వెంకటయ్య, కోరే సత్తయ్య, గిరి స్వామి, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు అగ్గి రాజు,సుదర్శన్,
యాదయ్య, ఎం సౌదమ్మ,బి అరుణ,వై వెంకటమ్మ, కే నాగమణి,లక్ష్మీనరసింహ,మహేష్, సామీల్,సైదులు తదితరులు పాల్గొన్నారు.