గ్రామ పంచాయితీ కార్మికులకు ఆర్ధిక సహాయం అందించిన కల్లూరి రాంచంద్ర రెడ్డి.
జనం సాక్షి జూలై 26
యాదాద్రి భువనగిరి జిల్లా.
తుర్కపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యలయం ముందు గత 21 రోజులుగా
గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఆలేరు కంటేస్టెడ్ ఎమ్మెల్యే కల్లూరి రాంచంద్ర రెడ్డి గ్రామ పంచాయితీ కార్మికుల ఖర్చుల కోసం 10 వేల రూపాయల ఆర్ధిక సహాయన్ని స్థానిక నాయకుల ద్వారా అందజేశారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డమీది యాదగిరి,మడిగే వెంకటస్వామి,గ్రామ పంచాయితీ సంఘం అధ్యక్షులు పల్లెపాటి లక్ష్మీ నరసింహ, ఉపాధ్యక్షులు ఎరుకల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి కసిరబోయిన శ్రీశైలం, కోశాధికారి తూటీ కృష్ణ, ప్రచార కార్యదర్శులు బూషి శేఖర్, ధనావత్ మల్లేష్, కార్యవర్గ సభ్యులు పలుగుల ప్రశాంతి ,భువనేశ్వరి ,బాలాజీ, సురేష్ కర్ణాకర్ యాదయ్య ఓరమ్మ భాగ్యమ్మ కమలమ్మ పద్మ తదితరులు పాల్గొనడం జరిగింది.