నారాయణఖేడ్ జులై14(జనంసాక్షి)
జూలై 15 గతంలో ప్రభుత్వం గ్రామ సేవలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున ఈ నెల 14న గ్రామ సేవకుల డివిజన్ సంఘం తరఫున అన్ని మండలాల తాసిల్దార్లకు సమ్మె నోటీసు ఇచ్చారు అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయంలో నిత్యం పనిచేసే గ్రామ సేవకులు గురువారం నుండి విధులకు దూరంగా ఉంటూ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నామని గ్రామ సేవలకు సంఘం డివిజన్ అధ్యక్షులు ఖాజమైనుద్దీన్ విలేకరులకు తెలిపారు 2020లో గ్రామ సేవకులకు పే స్కేల్ ప్రమోషన్ వారసత్వం ఉద్యోగాలు నూతన రేవిన్ చట్టం ప్రకారం గ్రామ సేవకులకు అన్ని విధాల ఆదుకుంటామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదని అందుకోసం రాష్ట్ర జేఏసీ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించకుండా మార్ముల గ్రామాల్లో గ్రామ సేవకులు విధులు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈనెల 25 తారీకు వరకు గ్రామ సేవకుల డిమాండును ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇస్తే 20వ తేదీ నుండి చేపట్టి నిర్వాదిక సమ్మెను నిలిపివేస్తామని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సేవకులు జేఏసీ సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఆయన తెలిపారు గ్రామ సేవకులకు అధికారులు రెవిన్యూ కార్యాలయంలో వివిధ రకాల పనులను తీసుకుంటూ అదే విధంగా గ్రామాల్లో సైతం గ్రామ సేవకుల సేవలను వాడుకుంటూ వస్తున్నారు తప్ప వారి ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వారు పేర్కొన్నారు ప్రస్తుతం తీసుకున్న సమ్మె నోటీసు గడువులోపు గ్రామ సేవకులకు పిలిపించి చర్చల ద్వారా వారి డిమిండ్లను పరిష్కరించాలని వారు తెలిపారు ఇప్పటివరకు కొనసాగించిన సమ్మెలు రిలే దీక్షలు కాకుండా ఈ సమ్మె నోటీసు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు యదా విధంగా విధులకు హాజరుకాకుండా 25వ తేదీ నుండి నిరవధిక సమ్మెను భారీ సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని గ్రామ సేవకులను సమ్మె చేస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయం ముందు డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన గ్రామ సేవకులు నిరసన కార్యక్రమాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ గ్రామ సేవకుల అధ్యక్షులు పండరి కంకిట మండల అధ్యక్షులు సతీష్ మనూరు మండల అధ్యక్షులు సంజీవులు ,నాగలిగిద్ద మండల అధ్యక్షులు రమేష్ ,సాయిలు ,నారాయణఖేడ్ మండల ఉపాధ్యక్షులు బాలరాజ్ ,కోశాధికారి రాజకుమార్ ,లక్ష్మయ్య, సాయిలు, గోపాల్,
సంగమేశ్వర్ ,తదితరులు పాల్గొన్నారు




