హైదరాబాద్: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 నియామకాలను మళ్లీ గ్రహణం పట్టింది. 2011వ సంవత్సరంలో ప్రకటించిన గ్రూప్ -1 నోటిఫికేషన్‌కు సంబంధించి కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రం కీలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియను నిలిపివేసి యథాతథ స్థితి కొనసాగించాలని కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. ఈమేరకు ఇవాళ స్టే ఉత్తర్వులు వెల్లడించింది. అయితే ప్రస్తుతం నిర్వహిస్తోన్న ఇంటర్య్వూల ప్రక్రియను మాత్రం కోనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇంటర్య్వూలకు సంబంధించి తుది నియామక ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఆదేశించింది. తాము ఇచ్చేతుది తీర్పు తీర్పుకు కట్టుబడి నియామకాలు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.




