నాచారం: స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఆధ్వర్యంలో సెప్టెంబరు 10న నిర్వహిస్తున్న ఇండియన్ ఇండిపెండెన్స్, ఇంటర్నేషనల్ యూత్ డే సంబరాల్లో భాగంగా,75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న అవార్డ్స్ ల ప్రధానోత్సవంలో ఆమ్ అద్మి పార్టీ ఉప్పల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మౌలాలి హె.బి.కాలనీ కు చెందిన డాక్టర్ ప్రియాంక ను గ్లోబల్ చెంజ్ మేకర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లో నీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు .అవార్డు కు ఎంపికైన సందర్భంగా బంధుమిత్రులు,నాయకులు, కార్యకర్తలు డాక్టర్ కు అభినందనలు తెలియజేశారు.
గ్లోబల్ చెంజ్ మేకర్ అవార్డు కు ఎంపికైన డాక్టర్ ప్రియాంక




