Wednesday, 4 November 2026

ఘనంగా అట్లతద్ది వేడుకలు

డోర్నకల్ అక్టోబర్ 13 జనం సాక్షి

మండల పరిధి ములకలపల్లి గ్రామంలో గురువారం తెరాస ఎంపిటిసి నంజ్యల నాగమణి మధు నివాసంలో అట్లతద్ది వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు.వివాహిత మహిళలు నోములు నోచుకొని వాయనాలు ముత్తయిదువులకు ఇచ్చుకొన్నారు.ఆడ పిల్లలు అట్లతద్ది వేడుకలను వేకువజాము నుంచి ప్రారంభించారు.పట్టు పావడాలు ధరించిన బాలికలు,పెద్దలు ఊయల ఊగి తమ ముచ్చట తీర్చుకున్నారు.ఈ వేడుకలకు వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో గ్రామంలోని మహిళలు వయస్సు తరతమ భేదం లేకుండా ఆనందంగా గడిపారు.కార్యక్రమంలో మహిళలు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.