*ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు

*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 15) అలంపూర్ పట్టణములో శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ .ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు*
*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ  సందర్బంగా అబ్దుల్ కలం విగ్రహం నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ లో కలామ్ గారి సేవలు మరువలేనివని అన్నారు*.
*ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు పోలీస్ చిన్నయ్య, వివేకానంద యూత్ అధ్యక్షులు సంజీవ నాయుడు. తెరాస పట్టణ అధ్యక్షులు వెంకట్రామయ్య శెట్టి, జితేందర్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, బిజేపి నాయకులు పాల్గొన్నారు.*

Attachments area