ఘనంగా ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

మక్తల్ జూలై 24: (జనంసాక్షి) మక్తల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కేక్ ను కార్యకర్తలకు తినిపించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు