*ఘనంగా కాన్షీరామ్ 16వ వర్ధంతి*

మునగాల, అక్టోబర్ 9(జనంసాక్షి): మండలంలోని విజయరాఘవపురం గ్రామంలో మాన్యశ్రీ కాన్షీరామ్ 16వ వర్ధంతిని ఆదివారం బహుజన్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి వీరన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కత్తి వీరన్న మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడు, బహుజన సమాజ సిద్ధాంతకర్త, కులాన్ని నిర్మూలిద్దాం బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అని బహుజనులను చైతన్య పరిచిన రాజకీయాల్లో సాటిలేని యోధుడు మాన్యశ్రీ కాన్షీరామ్ అని అన్నారు. రానున్న రోజుల్లో బహుజనులు బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేసి రాజ్యాధికారం తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త జూకూరి రామలింగం, అంబేద్కర్ యువజన సంఘ గౌరవ అధ్యక్షులు రెమిడాల లింగన్న, బుడగ జంగాల నాయకులు పస్తం సైదులు, కళ్యాణం సైదులు, బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకులు కత్తి నాగబాబు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఆర్. గౌతమ్, సంతోష్, కత్తి వేణు, సిద్దుల సిద్దు, సంజయ్, నాని తదితరులు పాల్గొన్నారు.