Wednesday, 4 November 2026

ఘనంగా కృష్ణాజన్మష్టమి వేడుకలు

చింతలమానేపల్లి జనంసాక్షి : మండలంలోని రవీంద్రనాగర్-1గ్రామంలోని
స్మార్త కృష్ణాష్టమి దేవాలయ మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేక అర్చనలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, రాధ. గోపికల వేషధారణలతో సందడి చేశారు.
అనంతరం సుభాష్ చంద్రబోస్ క్రికెట్ గ్రౌండ్లో సూరజ్ దాస్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డుబ్బుల నానయ్య హాజరై ఉట్టి వేడుకలను ప్రారంభించారు.
వేడుకలలో చిన్న పెద్ద తేడా లేకుండా ఉట్టి వేడుకలలో పాల్గొని, ఉట్టి కొట్టి పోటీలో నిలిచిన వారికి సూరజ్ దాస్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కృష్ణ బిశ్వాస్, సుబోల్ బిశ్వాస్, తారక్, విద్యార్థులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.