Friday, 6 November 2026

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

 హుస్నాబాద్ ఆగస్టు 19(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి వారి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించి,విద్యార్థులకు సంప్రదాయాలను వివరించారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎం అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ… వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ. హెచ్. ఎం. ఎల్సి , ఉపాధ్యాయ సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.