శామీర్ పేట్, జనం సాక్షి :
శనివారం శామీర్ పేట లో కొమురం భీం 122 వ జయంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. జోడేఘాట్ కేంద్రంగా 11 గ్రామాలను ఏకం చేసి గెరిల్లా తరహా పోరాటం చేసి పేద ప్రజల భూము లను కాపాడిన , పేద ప్రజల హక్కులను హరించే రజాకార్ల ను తరిమి కొట్టిన వీరుడని, ఆయన ఆశయాలను అనుస రించి పేద ప్రజల హక్కులను కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి , కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, మల్లేష్, గణేష్, అహ్మద్ అలీ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు




