శామీర్ పేట్, జనం సాక్షి :
సోమవారం శామీర్ పేట లో తెలంగాణవీర నారీ మణి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు… భూస్వాములతో వీరోచితంగా పోరాటం చేసి పేద ప్రజల భూములను అన్యాయంగా కబ్జా చేసుకున్న భూముల ను ఆ ప్రజలకే అప్పజెప్పిన వీర వనిత అని ఆమె పోరాటాలే ఎన్నో భూపోరాటాలకు నాంది పలికిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ఆమె జయంతి,వర్థంతులు అధికారికంగా చేయటం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, చాకలి సత్తయ్య, సరాంచందర్ , సాఖిబ్ తదితరులు పాల్గొన్నారు.
26ఎస్పీటీ -2: నివాళులు అర్పిస్తున్న నాయకులు
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు




