బిజెపిని ప్రజలు స్వాగతిస్తున్నారు
హత్నూర (జనం సాక్షి)
బిజెపిని ప్రజలు స్వాగతిస్తున్నారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగ ప్రభు గౌడ్ అన్నారు.మండలం పరిధిలోని ఎల్లమ్మ గూడలో సోమవారం బిజెపి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గ్రామంలో గల ఇతర పార్టీలకు చెందిన కొందరు నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనా తీరుపై యువత సుముఖత వ్యక్తం చేస్తున్నారని వారన్నారు.రోజురోజుకు బిజెపి పట్ల ప్రజాదారణ పెరుగుతుందని ఆయన చెప్పారు. మండలంలోని కొందరు ప్రజాప్రతినిధులు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఓబిసి మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ఎల్లం, జిల్లా నాయకులు అంబడి శ్రీశైలం,ప్రధాన కార్యదర్శి నవీన్,వనమ విజయ్, కుమార్,గిరి,ప్రశాంత్ భాస్కర్, మల్లిఖార్జున్,భూమేష్ తదితరులు పాల్గొన్నారు.