ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

బోనకల్ ,అక్టోబర్ 02 (జనంసాక్షి):
​బోనకల్​ మండల కేంద్రంలోని అన్ని మండల కార్యాలయాలలో, అదేవిధంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ అని అన్నారు. అహింస ఆయుధంగా బ్రిటీష్‌ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం అందించి జాతిపితగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల మండల నాయకులు ,సర్పంచులు, ప్రజలు, ప్రభుత్వ తదితర సిబ్బంది పాల్గొన్నారు.