నూతన పోతంగల్ మండల ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ కి శుభాభివందనాలు తెలిపిన. వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్

కోటగిరి అక్టోబర్ 2 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని 14 గ్రామాలతో నూతన మండల కేంద్రంగా పోతంగల్ ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కోటగిరి మండల వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ ప్రత్యేక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలియజేశారు.ఆదివారం రోజున హైదరాబాద్లోని స్పీకర్ నివాసంలో వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ శాసన మండలి చైర్మన్ గుప్త సుఖేందర్ రెడ్డి,శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసి వారికి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా గంగాధర్ పటేల్ మాట్లాడుతూ.నూతన మండలాల ప్రదాత,మాట ఇస్తే పట్టువదలని విక్రమార్కుడు,తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అని కొనియాడారు.నూతన మండల ప్రజల పక్షాన స్పీకర్ కి ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.14 గ్రామలతో కూడిన నూతన మండలంగా పోతంగల్ ను ఎంపిక చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ఒప్పించి మెప్పించి నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యు డివిజన్ పరిధిలో నూతనంగా పోతంగల్ మండలాన్ని ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన స్పీకర్ కి పోతంగల్ మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటామాని తెలియజేశారు.