ఘనంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం

పిల్లలు ఆరోగ్యవంతులైతే అన్ని రంగాల్లో రాణిస్తారు
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి ): జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం గురువారం కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 ఎంజి అనే నులి పురుగుల నివారణ టాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోరం కనకయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యవంతులైతే చదువుతోపాటు అన్ని రంగాలలో రాణిస్తారని ఆయన అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆరోగ్యమే మహాభాగ్యం అని ముఖ్యంగా ఎదిగే పిల్లల వయస్సు అయిన సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గ్రూపు పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడినట్లయితే రేపటి ఆరోగ్యవంతమైన భారత సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుందని, దీనికి మనమందరము కృషి చేయాలని దీనికి గాను అవసరమైన వ్యక్తిగత పరిశుభ్రత ,పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. మంచి పోషకాహారం ముఖ్యంగా పిల్లల్లో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించడంద్వారా పిల్లలకు ఆ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని ,తద్వారా పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు చదువుల్లో ఆటల్లో చక్కగా రాణించడానికి భారతదేశానికి పేరు తీసుకురావడానికి ఉపయోగపడతారని అన్నారు. పిల్లలు ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత కచ్చితంగా పరిశుభ్రంగా చేతులు కడుకోవాలని, వేడిఆహార పదార్థాలే భుజించాలని, పరిశుభ్రమైన నీరు త్రాగాలని, నులి పురుగుల నివారణకు సురక్షితమైన ఆల్బెండజోల్ మాత్ర తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి మింగాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ పిల్లలకు సూచించారు.