ఘనంగా జాతీయ సమైక్యత ఉత్సవాలు
పెగడపల్లి సెప్టెంబర్ 17(జనం సాక్షి)పెగడపల్లి మండల కేంద్రంలోని మండలప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ఎస్ ఐ శ్వేతా , మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ గొల్లి శోభ సురేందర్ రెడ్డి. తహసిల్దార్ కార్యాలయం ముందు తాసిల్దార్ కృష్ణ చేతన్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ జూనియర్ మోడల్ కళాశాల వద్ద ప్రిన్సిపల్ సుఖరి రవి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సూరజన్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద హెచ్ఎం ఎలా . లచ్చయ్య ,గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మేరుగు శ్రీనివాస్ ,జాతీయ జెండా ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయ వద్ద సర్పంచులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎంపీపీ శోభ జడ్పీటీసీ రాజేందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరులను జాతి నిర్మాతలను నిత్యం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి నేటికీ 75 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ రెడ్డి,,ఏపీవో వేణు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి , డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ ,ఆర్ఐ శ్రీనివాస్ ,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేందర్ రెడ్డి,ఎంపిటిసి లు , టిఆర్ఎస్ కోఆప్షన్ రహీమ్,అధికారులు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.