Tuesday, 3 November 2026

ఘనంగా జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తొర్రూర్ వీర నరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పస్తం సాంబ
కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తొర్రూర్ వీర నరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పస్తం సాంబ
తొర్రూర్ 14 జూలై (జనంసాక్షి ) జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను వారి నివాసంలో తొర్రూర్ వీర నరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పస్తం సాంబ ఆధ్వర్యంలో గురువారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పస్తం సాంబ మాట్లాడుతూ.ప్రజల కోసం పరితపించే ప్రజా నాయకుడు,ప్రజాప్రతినిధిగా ప్రజల అనుగుణం కష్టాలను తెలుసుకొని తన వంతు సాయం చేస్తూ ప్రజల కోసమే జీవిస్తున్న మన జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.అనంతరం తొర్రూర్ జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పస్తం సాంబ మరియు వారి టీంకి ఆయన కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీర నరసింహ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాస్, తొర్రూర్ డివిజన్ అధ్యక్షులు చిన్న గురవయ్య, కొండపల్లి నరసింహ, బోడబుర్తి లక్ష్మణ్, పేర్ల కృష్ణ రాయిశెట్టి వెంకన్న తదిరులు పాల్గొన్నారు.
Attachments area