ఘనంగా నారాయణ గురు జయంతి

అలంపూర్ ఆగష్టు 20 (జనంసాక్షి)
అలంపూర్ మండలకేంద్రం లో భారతీయ సామాజిక సంఘ సంస్కర్త నారాయణ గురు166 జయంతి  శనివారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తాలూక అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ సమాజంలోని మూడ విశ్వాసలను, కుల తత్వాన్ని నిరసించి, కులం కారణంగా కొన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ,వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ , సామాజిక స్వాతంత్రం ఉండాలని భావించిన గొప్ప వ్యక్తి నారాయణ గురు అన్నారు, ఆయన స్పూర్తితో తెలంగాణ లో బహుజన రాజ్యాధికార సాధిస్తాం అని అన్నారు , ఈ కార్యక్రమంలో  బీఎస్పీమండల అధ్యక్షులు నాగరాజు,  నాయకులు సురేష్  ,రమేష్ , మద్దిలేటి , నాగేశ్వర రావు , స్వాములు , రవి కుమార్ కనకం బాబు తదితరులు పాల్గొన్నారు.