*ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు నేరేడుచర్ల లో ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో ని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నేరేడుచర్ల ప్రధాన కూడలి వద్ద కేక్ కట్ చేసి,అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు,చిన్నారులకు ఫ్రూట్స్ కేకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సతీష్ రెడ్డి,చారి, నాగ,చరణ్,పవన్ గౌడ్, ఖలీల్,చందు,ముడుసు సురేష్ ,అంజి తదితరులు పాల్గొన్నారు.
 ]