ఘనంగా పీఎం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పీఎం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కట్కూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు ఆ పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి , పీఎం మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.పీఎం మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా చేశారని కొనియాడారు.శత్రు దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే విధంగా మోడీ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు.ఆర్థిక విధానాలతో పాటు రక్షణ రంగంలో భారతదేశం ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడుతుందన్నారు. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ని ఎదుర్కోలేక ఇబ్బంది పడితే మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొని దేశ ప్రజలను సురక్షితంగా ఉంచిందన్నారు. ఇలాంటి గొప్ప పీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా పట్టణ అధ్యక్షులు దోసకాయల ఫణి నాయుడు, పట్టణ అధ్యక్షులు ఎండీ అబిద్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర , జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి పల్సా మల్సూర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు పందిరి రాంరెడ్డి , వెన్న శశిధర్ రెడ్డి , పేర్వాల లక్ష్మణరావు, పోకల రాములు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వల్దాస్ ఉపేందర్ , మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు మీర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.