శామీర్ పేట్, జనం సాక్షి :
శామీర్ పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001- 2002 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు బొమ్మరాశిపేట గ్రామ పరిధిలోని లియోనియా రిసార్ట్ లో ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. సమాజం అంటే తెలియని స్థితిలో చిన్నారులుగా విడిపోయి వివిధ వృత్తుల్లో రాణిస్తున్న పూర్వ విద్యార్థులు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయి సంబరపడ్డారు. ఆ పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు గాను 50 మంది విద్యార్థులు హాజరై నారు. ఉపాధ్యాయునిగా సేవలందించినఉపాధ్యాయుడు బండి శ్రీరాములు ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆటపాటలతో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
4ఎస్పీటీ -2: పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో పాల్గొన్న దృశ్యం
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం




