*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(24):* మండల కేంద్రంలో బుధవారం బోనాల పండుగ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాన్ని సమర్పించి ధూప దీప నైవేద్యాలతో మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అలాగే కోళ్లు, మేకలు, గొర్రెలు, అమ్మవారికి సమర్పించారు. గ్రామంలో ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని పంటలు పండాలని, పశు పక్షాదులు, పిల్ల పాపలు, సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
*ఘనంగా పోచమ్మ బోనాల పండుగ*




