మాచారెడ్డి జనం సాక్షి . మార్చ్ 6..
మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా బందు కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు .అనంతరం ఆశా వర్కర్ లను, పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చుక్కాపూర్ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా కేసీఆర్ గారికి రాష్ట్రంలోని ఆడపడుచులు అందరూ రాఖీలు కట్టి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, ఎంపీటీసీ రూపా కృష్ణమూర్తి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, లచ్చయ్య గారి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేర రాజు, నవీన్ రెడ్డి, బెస్త నవీన్, నవీన్ ( చిన్నోడు), జీడిపల్లి రామ్ రెడ్డి, జీడిపల్లి నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




