Tuesday, 3 November 2026

ఘనంగా మహిళ బందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన మహిళలు

ఝరాసంగం మార్చి 6( జనంసాక్షి)  మండల కేంద్రంలో ని ఝరాసంగం తో పాటు కమాల్ పల్లి,ఈదులపల్లి, బర్దిపూర్, ఎల్గోయి,ప్యారవరం, గ్రామాల్లో ఆదివారం ఆయా  గ్రామాల్లో సర్పంచ్,మహిళ సంఘాల ఆధ్వర్యంలో మహిళ బంధు కార్యక్రమం మొదటిరోజు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి వందలాది మంది స్థానిక మహిళలు రాఖీలు కట్టి , మహిళా బందు మొదటి రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఉమకాంత్ పాటిల్, తెరాస మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి, సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్, మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్, పాటిల్, విజేందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు ఎజాజ్ బాబా,నాయకులు నాగన్న పాటిల్ బస్వరాజ్ పాటిల్, రాయికోటి బిచ్చమ్మ,బోజిరెడ్డి బాల్ రాజ్, నర్సింలు,వీరన్న పాటిల్,మహిళా  సంఘం అధ్యక్షురాలు మమాత, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, మహిళా స్వయం సహాయక పొదుపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.