Tuesday, 3 November 2026

ఘనంగా మహిళ బంధు ఉత్సవాలు

  పెన్ పహాడ్ మార్చి 06 (జనం సాక్షి) :మండల పరిధిలోని  దోసపహాడ్  గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్,  మరియు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో మహిళా దినోత్సవ సంబరాలను  టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్  ఆధ్వర్యంలో ఘనంగా మహిళ బంధు సంబరాలను ఆదివారం నిర్వహించారు.. ఈ సందర్భంగా   పారిశుద్ధ్య కార్మికులు,ఆశా వర్కర్‌లు,  , మరియు స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరెలు పంపిణీ చేశారు  .దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అడబిడ్డలకు సంక్షేమం సంరక్షణ అభివృద్ధికి అండగా అనేక కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో మన గ్రామ సర్పంచ్ దొంగరి సుధాకర్  ,ఉప సర్పంచ్ కొండేటి రాంబాబు  ,దొంగరి యుగేందర్ స్వాతి  ,  ఆశ వర్కర్లు మహిళ సంఘాల అధ్యక్షులు,గ్రామంలోని మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..