ఘనంగా మాజీ ఎంపీ జన్మదిన వేడుకలు
రుద్రంగి జూలై 22 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను రుద్రంగిలో శుక్రవారం తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జడ్పిటిసి గట్ల మీనయ్య మాట్లాడుతూ… మాజీ ఎంపీగా కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత వినోద్ కుమార్ కు దక్కిందని గుర్తు చేశారు.ఎంపీగా కరీంనగర్ కు ఎన్నో సేవలు చేసారని ఇప్పుడు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్
చైర్మన్ గా రాష్ట్రానికి సేవలందిస్తున్నారని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారాని అన్నారు. వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగే మరెన్నో పదవులు చేపట్టి రాష్ట్రనికి సేవలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,అంబటి గంగాధర్,మంచే రాజేశం,పుదరి శ్రీనివాస్,
దయ్యాల నారాయణ,శ్యామ్ సుందర్,గొళ్ళెం నర్సింగ్,చెప్యాల గణేష్,సింగరపు గంగారెడ్డి,
పొగుల నర్సయ్య,పాల నర్సయ్య,సింగరపు గంగరాజం,ఓద్యరపు మోహన్,బండారి నర్సయ్య
అచ్చుత్,ఆకుల గంగాధర్,దాసరి గంగరాజం,
తదితరులు పాల్గొన్నారు.