=ఘనంగా మార్కెట్ డైరెక్టర్ బచ్చు పరమేశ్వర్ పుట్టినరోజు వేడుకలు

కేసముద్రం అక్టోబర్ 20 జనం సాక్షి / గురువారం రోజున మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బచ్చు పరమేశ్వర్ పుట్టినరోజు వేడుకలను సాయంత్రం మార్కెట్ ఆవరణలో చైర్మన్ మర్రి నారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బచ్చు పరమేశ్వర్ ను చైర్మన్ మర్రి నారాయణరావు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని,ఎందరికో ఆదర్శంగా నిలవాలని చైర్మన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భట్టు శ్రీను,మార్కెట్ డైరెక్టర్ సంకెపల్లి జనార్ధన్ రెడ్డి, వివిధ పార్టీల నేతలు మార్తినేని పాపారావు, శివారపు శ్రీధర్, కార్యదర్శి రాజా పాల్గొన్నారు.