:శామీర్ పేట్, జనం సాక్షి :మంగళవారం శామీర్ పేట లో శ్రీ రేణుక ఎల్లమ్మ 5వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం శామీర్ పేట గౌడ సంఘం , గ్రామప్రజల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇందులో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్ తదితర పలువురు నాయకుల కు శాలువా కప్పి సన్మానించారు . అనంతరం జరిగిన అన్న దాన కార్యక్రమం లో నాయకుల తో పాటు ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్, సుదర్శన్, కిషోర్ యాదవ్ లతో పాటు ఐలయ్య యాదవ్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, భూమి రెడ్డి, గౌడ సంఘం నాయకులు శ్రీరాములు, పవన్ గౌడ్, సాయిగౌడ్, శ్రీకాంత్ గౌడ్ ,యాదాల్, గణేష్, పాండరీ నాద్, శ్రీనివాస్, వార్డు సభ్యులు ఉప్పలయ్య, శ్రీకాంత్ గౌడ్, మేడి రవి, మేడి భాస్కర్, బాల్ రాజ్, రవిందర్, నవీన్ గౌడ్ , గొలుసుల విష్ణు, సాజిద్, వెంకటేష్, వంగ నర్సింహ రెడ్డి, పవన్ ముదిరాజ్, వివిద గ్రామాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
18 ఎస్పీటీ -1: ఆఫ్జల్ ఖాన్ ను సన్మానిస్తున్న గౌడ సంఘం నాయకులు
ఘనంగా రేణుక ఎల్లమ్మ 5వ వార్షికోత్సవ వేడుకలు




