Wednesday, 4 November 2026

ఘనంగా శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూత గిరి మహారాజ్ పాదయాత్ర పల్లకి సేవ

ఝరాసంగం ఆగస్టు 28 (జనంసాక్షి)మండలంలోని కుప్పానగర్- చీల పల్లి గ్రామ శివారు లోని మల్లయ్య గిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్ పాదయాత్ర పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఆదివారం మండల పరిధిలోని సంఘం కే గ్రామం నుండి ఝరాసంగం చీల పల్లి గ్రామాల మీదుగా మల్లయ్యగిరికి చేరుకుంది.  ఆయా గ్రామాల్లో ఆశ్రమ పీఠాధిపతి కి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా కర్ణాటక, మహారాష్ట్రలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ళ మధ్య నృత్యాలు చేస్తూ, బోనాలతో, బాణాసంచాలు పేలుస్తూ మల్లయ్య గిరి ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం భక్తులు గట్టుపై ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.