ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…

ఊరుకొండ, ఆగస్టు 19 (జనం సాక్షి):
ఊరుకొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకట బలరామయ్య హై స్కూల్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలోని
శ్రీ వెంకట బలరామయ్య హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు, యశోద, గోపికల చక్కని వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు చూడముచ్చటగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ తంకచన్ శ్రీకృష్ణుని గొప్పతనం గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. శ్రీకృష్ణుడు, యశోద, గోపికల వేషధారణలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ఛైర్మన్ శ్రీ సామల తిరుపతయ్య, కరస్పాండెంట్ శ్రీ సామల బాలరాజు, డైరెక్టర్ శ్రీ సంతోష్, ప్రిన్సిపల్ శ్రీ తంకచన్ విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,