*ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విభిన్న వాయిద్యపరికరాలతో సంగీత ప్రదర్శన..
*ఈ కార్యక్రమానికి ఎటువంటి ప్రవేశరుసుము లేదు.
*మార్నింగ్ రాగాస్ ను ఆస్వాదించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన పురపాలక శాఖ స్పెషల్ CS అర్వింద్ కుమార్.
75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 21 న 75 GHMC పార్కులలో 75 మంది సంగీత విద్వాంసులచే సంగీత విభావరి – మార్నింగ్ రాగాస్ ప్రభాత గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఈ ప్రభాత గీతాలాపన సంగీత విభావరి ప్రదర్శన ఉంటుందని తెలిపారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఈ సంగీత విభావరి – మార్నింగ్ రాగాస్ ను ఆస్వాదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమమునకు ఎటువంటి ప్రవేశరుసుము లేదని తెలిపారు. ఉచితంగా మార్నింగ్ రాగాస్ ను ఆస్వాదించవచ్చని అర్వింద్ కుమార్ తెలిపారు.
(సంగీత విభావరి-మార్నింగ్ రాగాస్ ప్రదర్శించే 75 GHMC parks వివరాలు జతపరచనైనది)
————-_——————————–
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.




